హాకీ విన్నర్‌గా కేటీకే-5 అండ్ ఆల్ డిపార్ట్‌మెంట్స్

Sat,September 14, 2019 02:08 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : భూపాలపల్లి సింగరేణి ఏరియా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న క్రీడోత్సవాల్లో భాగంగా శుక్రవారం హాకీ క్రీడలు జరిగాయి. ఇందులో విన్నర్‌గా కేటీకే-5 అండ్ ఆల్ డిపార్ట్‌మెంట్స్ జట్టు నిలువగా, రన్నర్‌గా కేటీకే 8 అండ్ ఓసీపీ జట్టు నిలిచింది. మొదటి మ్యాచ్‌లో కేటీకే-1 అండ్ 6 జట్టు వర్సెస్ కేటీకే-5 అండ్ ఆల్ డిపార్ట్‌మెంట్స్ జట్టు తలపడ్డాయి. కాగా, 5-1 గోల్స్ తేడాతో కేటీకే-5 అండ్ ఆల్ డిపార్ట్‌మెంట్స్ జట్టు గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో కేటీకే-8 అండ్ ఓసీపీ వర్సెస్ కేటీకే-1 అండ్ 6జట్టు తలపడ్డాయి, కాగా, 2-1 తేడాతో కేటీకే-8 అండ్ ఓసీపీ జట్టు గెలుపొందింది. ఫైనల్‌లో కేటీకే-5 అండ్ ఆల్ డిపార్ట్‌మెంట్స్ జట్టు వర్సెస్ కేటీకే-8 అండ్ ఓసీపీ జట్టు తలపడగా, కేటీకే-5 అండ్ ఆల్ డిపార్ట్‌మెంట్స్ జట్టు కేటీకే-8 అండ్ ఓసీపీ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో గెలుపొంది విన్నర్‌గా నిలిచింది. రన్నర్‌గా కేటీకే-8 అండ్ ఓసీపీ జట్టు నిలిచింది. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, కో ఆర్డినేటర్ ఎండీ అఫ్జల్, కెప్టెన్స్, రెఫరీస్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles