రామప్ప అద్భుతం..

Sun,September 15, 2019 03:17 AM

వెంకటాపూర్, సెప్టెంబర్ 14 : రామప్ప అందాలు అద్భుతంగా ఉన్నాయని వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) రవీందర్ కొనియాడారు. కాకతీయుల కళా సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న రామప్ప దేవాలయాన్ని ఆయన కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. ఆయనకు ఆలయ పూజారులు ఉమాశంకర్ స్వాగతం పలికారు. రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను కల్యాణ మండపంలో ఆలయ సిబ్బంది ఘ నంగా సత్కరించారు. అనంతరం ఆయన రామప్ప శిల్ప సౌందర్యాన్ని కొనియాడారు. మదనికలు, గజకేసరులు, సాలభంజికల విగ్రహాలు పర్యాటకులను మైమరపించేలా ఉన్నాయని తెలిపారు. ఆయన వెంట ములుగు సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి, ఎస్సై భూక్య నరహరి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles