సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Sun,September 15, 2019 03:18 AM

గణపురం, సెప్టెంబర్ 14: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వరంగల్ రూరల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి పిలుపునిచ్చారు. మండలంలోని ధర్మారవుపేట గ్రామంలో గండ్ర సత్యనారాయాణరావు వర్గానికి చెందిన సీనియర్ నాయకులు కేశెట్టి ప్రకాశ్‌బాబు, మాడ లింగయ్య, కటకం రాజుతో పాటు 20 మంది టీఆర్‌ఎస్‌లో శనివారం చేరారు. వారికి ఆమె కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువకులు, మహిళలు, వృద్ధులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు.

గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దివి ప్రసాద్‌నాయుడు, పొలుసాని లక్ష్మీనర్సింగరావు, పోతుల విజేందర్, ఆకుల రవీందర్, గండు శ్రీధర్, ఆకుల తిరుపతి, గండ్ర యువసేన జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి పూర్ణ చంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సుధాకర్, పాషా, గంపల వేణు తదితరులు ఉన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles