లక్ష్మీ బరాజ్‌లో తగ్గిన నీటి ప్రవాహం

Thu,September 19, 2019 02:52 AM

మహదేవపూర్, సెప్టెంబర్ 18 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్‌లో క్రమక్రమంగా నీటి ప్రవాహం తగ్గుతుంది. ఈ క్రమం లో బరాజ్‌లో మంగళవారం 26 గేట్లను ఎత్తి నీటిని వదులగా, బుధవారం 20గేట్లను ఎత్తి నీటిని తరలిస్తున్నట్లు అధిరులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాణహిత నది ద్వారా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో గోదావరి జలాలు మేడిగడ్డ బ్యారేజీ మీదుగా ప్రవహిస్తుండడంతో నీటి ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. బుధవారం బరాజ్‌లో 94.75 మీటర్ల ఎత్తులో 4.244 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే, 1.50లక్షల ఇన్‌ఫ్లో, 1.20 లక్షల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

సరస్వతీబరాజ్‌లో 11గేట్లు ఎత్తివేత..
కాళేశ్వరం : రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మించిన సరస్వతీబరాజ్‌లో బుధవారం 11గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గత కొన్ని రోజుల నుంచి బరాజ్‌కు ఇన్‌ఫ్లో తక్కువగా ఉండడంతో ఒక గేటు నుంచి నీటిని వదిలారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 21,300 క్యూసెక్కుల నీరు రాగా 11గేట్లు ఎత్తి 49,511 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బరాజ్‌లో 9.93 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 1,50,000 క్యూసెక్కులుగా ఉంది.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles