బియ్యంలో ఎలాంటి తేడా లేదు సివిల్ సప్లయి డీఎం రవీందర్

Thu,September 19, 2019 02:53 AM

ములుగురూరల్, సెప్టెంబర్18 : పాఠశాలలకు అందజేస్తున్న సన్నబియ్యంలో ఎలాంటి అవకతవకలు లేవని సివిల్ సప్లయి డీఎం రవీందర్ అ న్నారు. బుధవారం ఆయన ములుగు మండల పరిధిలోని మల్లంపల్లి ప్రా థమిక, ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలను డీసీఎస్‌వో అరవింద్‌రెడ్డి, డీటీ సత్యనారాయణలతో కలిసి సందర్శించారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు సివిల్ సప్లయి ద్వారా అందజేస్తున్న సన్నబియ్యంలో ఏమైనా తేడా లు ఉన్నాయా..? అని పరిశీలించారు. ఈ మేరకు విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం వారి తో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ సివిల్ సప్లయి ద్వారా అందజేస్తున్న బియ్యంలో ఎలాంటి అవకతవకలు లేవని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వారి వెంట సర్పంచ్ చంద కుమారస్వామి, పాఠశాలల హెచ్‌ఎంలు గోపాల్‌రెడ్డి, విజేందర్, ఉపాధ్యాయులు సర్వన్, సుజిత ఉన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles