ఆదర్శప్రాయుడు వాల్మీకి

Mon,October 14, 2019 04:08 AM

-జయంతి కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి
-కలెక్టర్ నారాయణరెడ్డి
ములుగు, నమస్తేతెలంగాణ: ఆదికవి వాల్మీకి మహర్షిని ప్రజలు ఆదర్శంగా తీసుకొని చైనత్యవంతులు కావాలని ములుగు జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అన్నారు. వాల్మీకి జయంతిని ఆదివారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారంగా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఇతిహాసాలైన రామాయణ భారత గ్రంథాలను ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. వాల్మీకి రాసిన రామాయణ గ్రంథంలోని పలు విషయాల విశిష్టతను, కుటుంబంలోని అనుబంధాలను వివరించి ఆయన గొప్పతానాన్ని కలెక్టర్ కొనియాడారు. వాల్మీకి మహర్షిని అందరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి లక్ష్మయ్య, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్‌యాదవ్, జెడ్పీటీసీ సకినాల భవాని, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మొగుళ్ల భద్రయ్య, వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర కార్యదర్శి సంతోష్, బీసీ సంఘం నాయకులు శ్రావణ్, మామిడిశెట్టి కోటి, పులి శ్రీకాంత్, గూడూరు ప్రశాంత్, జిల్లా నాయకులు, అత్మీయ కుస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శం జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శైలజ
భూపాలపల్లి టౌన్: రామాయణం లాంటి మహాకావ్యాన్ని రచించి భారతదేశానికి రాముడి గొప్పతనాన్ని తెలియజేసిన వాల్మీకి మహర్షి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి శైలజ అన్నారు. వాల్మీకి జయంతిని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలనే తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లోని సమావేశ మందిరంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. దీనికి శైలజ ముఖ్య అతిథిగా హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వెనుకబడిన అన్ని కులాల వారు తమ మహనీయుల జయంతి ఉత్సవాలను సమిష్టిగా ఘనంగా జరుపుకున్నప్పుడే ఆ మహనీయులను అనుసరించిన వారమవుతామన్నారు. వాల్మీకి అటవీ తెగకు చెందినవాడని, కరువు వల్ల బతుకుదెరువు కోసం ఉత్తర భారతదేశం నుంచి వలస బాట పట్టి ఆర్య తెగకు చెందిన సప్త ఋషులచే జ్ఞానోదయమై మహర్షిగా మారి దండకారణ్యం గుండా శ్రీలంకకు వలస వెళ్లి రామాయణాన్ని రచించాడన్నారు. ఇలాంటి మహనీయుల జయంతులను కుల మతాలకు అతీతంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షుడు దీశెట్టి గోపాల్, బీసీ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్, దళిత సంఘం జిల్లా అధ్యక్షుడు భద్రయ్య, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, రజక సంఘం మహిళా అధ్యక్షురాలు ఓరుగంటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles