మద్యం షాపులకు 385 దరఖాస్తులు

Tue,October 15, 2019 03:38 AM

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 14 : జయశంకర్ భూపాలపల్లి , ములుగు జిల్లాల్లో మద్యం షాపులకు ఇప్పటి వరకు 385 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 9 నుంచి మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఐదు రోజుల్లో 385 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా భూపాలపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వచ్చాయి. భూపాలపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 121, కాటారం పరిధిలో 56, ములుగు పరిధిలో 114, ఏటూరునాగారం పరిధిలో 94 దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉండగా సొమవారం రెండు జిల్లాల పరిధిలో 216 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి తెలిపారు. భూపాలపల్లి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 69, కాటారం పరిధిలో 41, ములుగు పరిధిలో 50, ఏటూరునాగారం పరిధిలో 56 దరఖాస్తులు వచ్చాయన్నారు. 18న మిలీనియం క్వార్టర్స్‌లోని కమ్యూనిటీ హాలులో డ్రా తీస్తామన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles