గ్రామాభివృద్ధికి విరాళం అందజేత

Fri,October 18, 2019 03:40 AM

-మంత్రి ఎర్రబెల్లికి చెక్కును అందజేసిన కాపులకనపర్తి వాసి
రెడ్డికాలనీ, అక్టోబర్ 17: 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలులో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామ అభివృద్ధి కోసం ఆ గ్రామ ప్రముఖుడు అన్నమనేని రాంచందర్‌రావు రూ. లక్ష విరాళం ప్రకటించారు. రూ.50 వేలను సెప్టెంబర్ 6న కాపుల కనపర్తి లో జరిగిన గ్రామసభలో ఇచ్చారు. మరో రూ.50 వేల చెక్కును గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అందజేశారు. ఈ మేరకు ఆయన హన్మకొండలోని మంత్రి నివాసంలో అందజేశారు. గ్రామాల అభివృద్ధికి విరాళాలు ఇవ్వడం స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు అన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles