శ్వేతార్కుడికి ఘనంగా సప్తవర్ణాభిషేకం..

Fri,October 18, 2019 03:41 AM

-వైభవంగా స్వామి వారి ఊరేగింపు
కాజీపేట, అక్టోబర్ 17 : కాజీపేట పట్టణంలోని శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో సంకటహర చతుర్ధిని పురస్కరించుకుని శ్వేతార్కుడికి గురువారం సప్త వర్ణాభిషేకం నిర్వహించినట్లు దేవాలయ వ్యవస్థాపకుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధ్దాంతి తెలిపారు. స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు 108 లీటర్ల రంగులతో అభిషేకాలు చేసినట్లు ఆయన వివరించారు. ప్రత్యేక అభిషేకాలు అయినవోలు అనంత మల్లయ్య శర్మ, సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో చేపట్టారు. అనంతరం భక్తులు స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో పెట్టి పట్టణ పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ప్రత్యేక పూజల్లో కాజీపేట ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ దంపతులు, వర్ధన్నపేట ఎస్సై ఉపేందర్ దంపతులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు దేవాలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles