తగ్గుతూ.. పెరుగుతూ..

Sat,October 19, 2019 03:15 AM

కాళేశ్వరం, అక్టోబర్18: కాళేశ్వరం వద్ద గోదావరి ఉదయం తగ్గి, సాయంత్రం పెరిగింది. శుక్రవారం ఉదయం 20 వేల క్యూసెక్కులుగా నమోదైన గోదావరి నదీ ప్రవాహం సాయంత్రం 48 వేల క్యూసెక్కులకు పెరిగింది. మహారాష్ట్రలో వర్షాలు పడడంతో వరద పెరుగుతున్నదని అధికారులు తెలిపారు. అలాగే సరస్వతి(అన్నారం) బరాజ్‌లో శుక్రవారం ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. బరాజ్‌కు ఇన్‌ఫ్లో 5200 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో ఒక గేటును ఎత్తి 4500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బరాజ్‌లో 9.47 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఇంజినీర్లు తెలిపారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles