తుపాకులగూడెం బరాజ్‌ను సందర్శించిన ఓఎస్డీ

Sun,October 20, 2019 04:05 AM

ఏటూరునాగారం, అక్టోబర్ 19: కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం బరాజ్‌ను ఓఎస్డీ సురేశ్ కుమార్ శనివారం సాయంత్రం సందర్శించారు. బరాజ్ వద్ద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. పరిసరాలను వీక్షించి భద్రతా ఏర్పాట్లను సీఐ నాగబాబును అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో నిత్యం అప్రమత్తంగా ఉండి రక్షణ కల్పించాలని సురేశ్‌కుమార్ సూచించారు. అవతలి వైపున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కన్నాయిగూడెంలోని పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అక్కడ కల్పిస్తున్న భద్రతా వివరాలను సీఐ నాగబాబు, ఎస్సై శ్రీకాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. అనునిత్యం అప్రమత్తంగా ఉండే విధంగా సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేశారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles