గాలికుంటు టీకాలను వేయించాలి


Thu,July 11, 2019 03:46 AM

చారకొండ: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ప్రతి పశువుకు వేయించాలని మండల వైస్ ఎంపీపీ నకినమోని బక్క అన్నారు. బుధవారం మండలంలోని జూపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గాలికుంటు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం కార్యక్రమంలో రైతు సమితి గ్రామ కోఆర్డినేటర్ వెంకటయ్య టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు బాలేమియ, కోఆప్షన్ సభ్యుడు సలీం, మండల పశువైద్యాధికారి డాక్టర్ పవన్‌కుమార్, వీఎల్‌వో జానయ్య ఓఎస్ శివరాం గోపాలమిత్ర గిరియాదవ్, మల్లయ్య, జంగయ్య పాల్గ్గొన్నారు.

వెల్దండ: కుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని బొల్లంపల్లి సర్పంచ్ అపర్ణ అన్నారు. బుధవారం వెల్దండ మండలం బొల్లంపల్లి, చల్లపల్లి, అంకమోని కుంట గ్రామాలలో మండల పశువైద్య కేంద్రం ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి టీకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ రాజు, డాక్టర్ నరేశ్‌రెడ్డి, సిబ్బంది శ్రీను, నర్సింహ్మ, తదితరులు ఉన్నారు.

కల్వకుర్తి రూరల్ : కల్వకుర్తి మండలంలోని తుర్కలపల్లి, జిళ్లేల్ల, తిమ్మరాశిపల్లి గ్రామాలలో బుధవారం కల్వకుర్తి పశువైద్యశాఖాధ్వర్యంలో గాలికుంటు నివారణ మందు పంపిణీ కార్యక్రమం కొనసాగింది. జిళ్ళెల్ల, తుర్కల గ్రామాలలో టీకాల పంపిణీ కార్యక్రమానికి సర్పంచులు జంగయ్య, హాజరై పశువులకు టీకాలను అందించారు. కార్యక్రమంలోకల్వకుర్తి పశువైద్యశాల ఏడీ జగదీశ్వరి, డాక్టర్ శ్రీనాథ్, సిబ్బంది,తదితరులున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...