అత్తగారింటి ముందు కోడలు నిరసన


Sat,July 13, 2019 04:20 AM

వడ్డేపల్లి : మండలంలోని కొంకల గ్రామంలో శుక్రవారం శిరీష అనే వివాహిత తన అత్తగారింటి ముందు నిరసన చేపట్టింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గట్టు మండలానికి చెందిన నర్శింహులు గౌడ్, లక్ష్మిల పెద్ద కూతురైన శిరీషకు కొంకల గ్రామానికి చెందిన హరిప్రసాద్ అనే యువకుడితో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగిందన్నారు. పెళ్లి సందర్భంగా లక్షా 50 వేలు, ఆరున్నర తులాల బంగారం కట్నంగా ఇచ్చారన్నారు. పెళ్లయిన నాలుగు నెలల తర్వాత అదనపు కట్నం కోసం అత్తవారింటి నుంచి వేధింపులు మొదలయ్యాయని తెలిపారు. కొంతకాలం తర్వాత బలవంతంగా పుట్టింటికి పంపారన్నారు. కట్నం ఇవ్వలేమని శిరీష తల్లిదండ్రులు అల్లుడు, అతని తల్లిదండ్రులతో పలుమార్లు విన్నవించుకున్నారని చెప్పారు. అయినా రెండు సంవత్సరాలుగా అమ్మాయిని కాపురానికి రానివ్వడం లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తోచక చివరకు భర్త ఇంటి ముందు తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వంటావార్పు నిర్వహించి ఇంటి ముందు బైటాయించి నిరసన కార్యక్రమం చేపట్టిందన్నారు. చివరకు గ్రామ పెద్దలు వారి దీక్షను విరమింపజేశారని తెలిసింది. ఈ విషయమై ఎస్సై మహేందర్‌ను వివరణ కోరగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...