పీయూలో పీహెచ్ స్కాలర్స్‌ను పెంచి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి


Sat,July 13, 2019 04:21 AM

పాలమూరు యూనివర్సిటీ : పాలమూరు విశ్వ విద్యాలయానికి జాతీయ స్థాయిలో గు ర్తిం పు తీసుకురావడానికి పీహెచ్‌డీ స్కాలర్స్ పెంచాలని పీయూ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య భూక్యా రాజారత్నం అన్నారు. శుక్రవారం పీయూ పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన ఐక్యూఎసీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పాలమూరు విశ్వ విద్యాలయానికి న్యాక్ గ్రేడింగ్ రావడంతో పీయూలో పీహెచ్‌డీ సూపర్‌వైజర్లను పెంచారని తెలిపారు. పీయూలో పీహెచ్‌డీ స్కాలర్స్‌ను పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే పీయూలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సెమినార్లను నిర్వహించడం జరిగిందని, ఈ సె మినార్ల ద్వారా యూనివర్సిటీ గుర్తింపు పొందిందన్నారు. ఫ్యాకల్టీని అవసరమైన స్థాయిలో ఉపయోగించుకొని అభివృద్ధి కార్యక్రమాలు పెంచాలన్నారు. పీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గిరిజా మంగతాయారు, ఐక్యూఎసి డైరెక్టర్ డాక్టర్ సంధ్యా తివారీలు మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. యూనివర్సిటీని అన్నివిధాలా అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ నూర్జాహన్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సెక్రటరీ లయన్ నటరాజ్, ఓఎస్‌డీ మధుసూదన్‌రెడ్డి, పరీక్షల విభాగం ఇన్‌చార్జి పిండి పవన్‌కుమార్, చంద్రకిరణ్ తదితరులు ఉన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...