టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు ..అపూర్వ స్పందన


Sun,July 14, 2019 01:18 AM

ఉప్పునుంతల : జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన లభిస్తుందని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి , సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి బైకాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శనివారం మండలంలో స భ్యత్వ నమోదును పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి పథకాలను చూసి స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్నారన్నారు.టీఆర్‌ఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి బంగారు తెలంగాణ వైపు దూసుకువెళ్తున్న తరుణంలో ప్రజలు స్వచ్ఛందగా వచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవడం హర్షణీయమన్నారు. మండలంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పోటీ పడి పనిచేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మండలంలో మండలంలో ఇప్పటివరకు చేసిన సభ్యత్వ కాఫీలను, రుసుమును మండల ఇన్‌చార్జి నర్సింహ్మరెడ్డికి అందజేశారు. మండల ఇన్‌చార్జి నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారన్నారు. మండలంలో టీఆర్‌ఎస్ సభ్యత్వం నమోదు లక్ష్యాన్ని అధిగమిస్తున్నట్లు వెల్లడించారు.కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ అరుణానర్సింహ్మరెడ్డి, నాయకులు భాస్కర్, కొట్టే శ్రీను, రాజేందర్‌రెడ్డి, ఎల్లయ్యయాదవ్, చిన్నజంగయ్య, బాలస్వామి, గణేష్, బింగి పర్వతాలు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

నేడు కొండనాగులకు స్వామిజీ రాక
బల్మూరు : మండలంలోని కొండనాగులకు దేవనాద జీయర్ స్వామిజీ విచ్చేయుచున్నట్లు వికాసతరంగిణి, స్థానిక హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు కొండల్, జంగయ్య, ఆనంద్, రామస్వామిగౌడ్, శ్రీశైలంగౌడ్‌లు శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 10 : 30 గంటలకు గ్రామానికి చేరుకుని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆలయంలో భక్తులకు ప్రవచనలు బోధించడం జరుగుతుందని సూచించారు. మండలంలోని భజన కళాకారులు, భక్తులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...