అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు


Mon,July 15, 2019 01:30 AM

చిన్నంబావి : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులను చేసి ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దగడపల్లి గ్రామ సర్పంచ్‌ సువర్ణతో పాటు ఆరుగురు వార్డు మెంబర్లు కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం గ్రామం అభివృద్ధి చెందాలని అధికార పార్టీలో చేరుతున్నారన్నారు. ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబార క్‌, రైతుబీమా, రైతుబంధు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎంజీకేఎల్‌ఐ నీటిని సింగోటం రిజర్వాయర్‌ నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి జూరాల చివరి ఆయకట్టు రైతులకు నీరందిస్తామని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకటరామమ్మ, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు చక్రదర్‌గౌడ్‌, రామస్వామి, శ్రీధర్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ ఇంద్రసేనారెడ్డి, నాయకులు రామన్‌గౌడ్‌, చిన్నారెడ్డి, కిరణ్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...