నేర నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలకం


Tue,July 16, 2019 05:10 AM

నల్లగొండక్రైం : మారుతున్న పరిస్థితులకనుగుణంగా నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సీఐలు, ఎస్‌ఐలు, సీసీటీఎంఎస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు ట్యాబ్‌ల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఏ చిన్న సంఘటన జరిగినా వాటి వివరాలు ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని తెలిపారు. డయల్ 100 ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. ప్రతి నెల డయల్ 100, ఆన్‌లైన్ చలానాలు, ఈపీటీ కేసులపై సమీక్షించడం జరుగుతుందన్నారు. అదనపు ఎస్పీ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ఈ చలాన్, పీటీ కేసులు సైతం ఆన్‌లైన్ ద్వారా జారీ చేసేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమావేశంలో సీఐలు రవీందర్, శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్, గౌరీనాయుడు, రవికుమార్, ప్రభాకర్‌రెడ్డి, సురేష్, రాజా, రమేష్, ఎస్‌ఐలు రాజశేఖర్‌రెడ్డి, సైదాబాబా, శంకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కేతేపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ
కేతేపల్లి : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టేషన్‌లో ఉన్న పలు రికార్డులను పరిశీలించి, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైవేపై వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని సూచించారు. ఆయన వెంట సీఐ క్యాస్ట్రోరెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణ ఉన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...