నేటి నుంచి దోస్త్ ప్రత్యేక షెడ్యూల్


Wed,July 17, 2019 04:22 AM

-ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు అవకాశం
గతంలో చేసుకోని వారికి కూడామరో అవకాశం
ఎంజీయూనివర్సిటీ : తెలంగాణలో వివిధ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ) ప్రత్యేక అవకాశం కల్పిస్తు మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం htttps://dost.cgg.gov.inలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాత్మగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారితో పాటు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు.

రిజిస్ట్రేషన్లు ఇలా...
దోస్త్ స్పెషల్ పేజ్ రిజిస్ట్రేషన్లు బుధవారం నుంచి ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్‌లో రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఇప్పటి వరకు దోస్త్ పేజ్1, 2, 3లలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారు, సీటు వచ్చి ఆన్‌లైన్‌లో సెల్పు రిపోర్టింగ్ చేయని విద్యార్థులు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

షెడ్యూల్ ఇలా...
రిజిస్ట్రేషన్లు ఈ నెల 17 నుంచి 22 వరకు, ప్రత్యేక కేటగిరి (ఎన్‌సీసీ, పీహెచ్ తదితర) విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 20న ఉంటుంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న విద్యార్థులకు 26న సీటు అలాట్‌మెంట్ కావడం జరుగుతుంది. సీట్ అలాట్‌మెంట్ అయిన విద్యార్థులు ఈనెల 26 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో సెల్పు రిపోర్టింగ్ చేయడంతో పాటు సీటు వచ్చిన కళాశాలల్లో ప్రవేశంపొందాలి.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...