బాలికల నిష్పత్తిని పెంచాలి


Sat,July 20, 2019 06:12 AM

నీలగిరి : జిల్లాలో బాలికల నిష్పత్తి పూర్తిగా తగ్గిపోయిందని, దీన్ని క్షేత్రస్థాయిలో పెంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఐసీడీఎస్ రీజనల్ ఆర్గనైజర్ మాలే శరణ్యారెడ్డి అన్నారు. శుక్రవారం రామ్‌నగర్‌లోని టీటీడీసీలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ, మహిళా శక్తికేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమంపై ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో బాలికల నిష్పత్తి బాలుర కంటే రోజురోజుకు తగ్గిపోతుందని క్షేత్రస్థాయిలో నిష్పత్తి శాతాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లింగబేధం, వివక్ష, సాంఘిక దురాచారాలను పారదోలాలని ఇందుకు ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయిలో ప్రణాళికలను తయారుచేసుకుని అమలుచేయాలన్నారు. జిల్లాలో మహిళలు గర్భవతులు కాగానే మొదటిగా ఆశాలకు, అంగన్‌వాడీ టీచర్లకే సమాచారం వస్తుందని వీరు ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారిపై ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటుచేయాలన్నారు. లింగ నిర్దారణ పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో పాటు వారికి పూర్తి అవగాహన కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ పీడీ సుభద్ర మాట్లాడుతూ జిల్లాలో బాలబాలికల నిష్పత్తిని పెంచడంలో ప్రతిఒక్కరు తగిన తోడ్పాటును అందించాలన్నారు. బాలబాలికలకు విద్యను అందించి ప్రోత్సహించడంతో కొంతవరకు లింగ నిష్పత్తిని పెంచవచ్చన్నారు. అంతకుముందు జిల్లా సంక్షేమశాఖ అదికారి సుభద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డెమో బిరుదుల వెంకన్న అంగన్‌వాడీలకు, ఆశాలకు లింగ నిర్ధారణ పరీక్షలు, చట్టాలు, అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో తూముల నిర్మల, మహిళా శక్తి కేంద్రం కోఆర్డినేటర్ ఎం. సునీత, బాలల పరిరక్షణ అధికారి కాసాని గణేష్, పోషన్ అభియాన్ ప్రోగ్రాం ఇన్‌చార్జి హారిక, డీఆర్‌డీఏ డీపీఎం అరుణ్‌కుమార్, ఐసీడీఎస్, ఐసీపీఎస్ సిబ్బంది ఉమారాణి, సునీత, వినోద, ప్రణిత, అంగన్‌వాడి టీచర్లు, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...