పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి


Sun,July 21, 2019 01:24 AM

దేవరకొండ, నమస్తే తెలంగాణ : పోలీస్‌శాఖలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పద్మనాభరెడ్డి అన్నారు. శనివారం ఆయన దేవరకొండ డీఎస్పీ కార్యాలయాన్ని, పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేశ్వర్‌తోపాటు సబ్‌డివిజన్ పరిధిలోని నలుగురు సీఐలు, ఎస్సైలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు చేసే సేవలు, డయల్ 100 కాల్ సర్వీస్, బ్లూకోల్డ్స్, పెట్రోల్ కార్ సర్వీసెస్, రిసెప్షన్ మేనెజ్‌మెంట్, మెయింటెన్స్ ఆఫ్ పోలీస్ స్టేషన్‌లకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఎఫ్‌ఐఆర్ కేసుల నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌శాఖలో రోజురోజుకు వస్తున్న సాంకేతికతను వినియోగించుకుని కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐలు జె.వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గౌరినాయుడు, ఎస్సైలు తదితరులున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...