బడుగుల కళ్లల్లో వెలుగులు


Sun,July 21, 2019 01:33 AM

-తండ్రి పాత్ర పోషిస్తున్న సీఎం కేసీఆర్..
-ఉద్యమ కాలంలోనే పింఛన్ పెంపునకు అంకురార్పణ
-సంక్షేమ రంగంలో విప్లవాత్మకం
-విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
-ఉమ్మడి జిల్లాలో పింఛన్ పెంపు ఉత్తర్వులు అందజేత
సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ:బడుగు, బలహీన వర్గాలతో పాటు ఆపన్న హస్తం కోసం ఎదురు చేసే వారి కళ్లల్లో వెలుగులు నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రాష్ట్రం మొత్తానికే ఆయన తండ్రి పాత్ర పోషిస్తున్నారని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆసరా సామాజిక పింఛన్ పెంపు ప్రొసీడింగ్స్ అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిట్యాల మండలకేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ పింఛన్ పెంపునకు తెలంగాణ ఉద్యమ సమయంలోనే అంకురార్పణ జరిగిందన్నారు. ఆర్థికంగా చేయూత నివ్వడానికే ఆసరా పింఛన్లు పెంచినట్లు తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి బడుగుల కండ్లలో వెలుగులు చూడాలన్న తపనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్ మొత్తాలను రెట్టింపు చేశారని తెలిపారు. పింఛన్ పేరు మీద తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న మొత్తం అక్షరాలా రూ.12వేల కోట్లు అని యావత్ భారతదేశంలో ఇంత మొత్తం చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్నారు. సంక్షేమ రంగానికి రూ.45వేల కోట్లు కేటాయించి ఖర్చు పెడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే చెల్లిందన్నారు. ఆకలిచావులు, ఆత్మహత్యలతో తల్లడిల్లిన పరిస్థితులను ఉద్యమ సమయంలోనే అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంపునకు శ్రీకారం చుట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...