యాదాద్రిలో భక్తుల సందడి


Mon,July 22, 2019 01:43 AM

-కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు
-ఉత్సవమూర్తులకు అభిషేకం
-వైభవంగా శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజలు
యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : పుణ్యక్షేత్ర సందర్శన.. ఇష్టదేవుడి దర్శనం.. మొక్కు పూజలతో యాదాద్రి పంచనారసింహ క్షేత్రం ఆదివారం జన సందోహంతో నిండుకుంది. శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బా రులు తీరిన భక్తులతో సముదాయాలు. మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయా యి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకం గా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతా లు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ. 89,000 ఆదాయం సమకూరింది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సు ప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేధనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నా రు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ము ఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపం లో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.

శ్రీవారి ఖజానాకు రూ.15,33,397 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 15,33,397 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బు కింగ్‌తో రూ.78,748, 100 రూపాయల టిక్కెట్‌తో రూ.23,900, 150 రూపాయల టిక్కెట్ దర్శనంలో రూ. 3,87,450, గదులు విచారణ శాఖతో రూ. 77,760, ప్రసాదవిక్రయాలతో రూ.6,55,120 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు. అన్ని వి భాగాలు కలుపుకుని రూ.15,33,397 ఆదాయం వచ్చిందని ఆమె వివరించారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...