ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..


Mon,July 22, 2019 01:44 AM

-ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, నమస్తే తెలంగాణ : ప్రజాసంక్షమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యుడు నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను పట్టణంలోని 19వ వార్డు నుండి 36వార్డుల్లో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో అమలులో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 60ఏండ్ల నుండి 57ఏండ్లకు వయసు తగ్గించి వెయ్యి రూపాయల నుండి 2016, వికలాంగులకు 1500 నుండి 3016 రూపాయాలను పింఛను పెంచడం జరిగిందన్నారు. అర్హులైన వారందరికి ఆసరా పింఛన్లు అందేలా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల్లో ఆత్మైస్థెర్యం పెరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలతో తెలంగాణ రానున్న రోజుల్లో పూర్తిగా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడం గోదావరి జలాలు పారడంతో సీఎం కేసీఆర్ కల నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జగన్నాధరావు, టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరునగర్ భార్గవ్, మగ్ధుమ్‌పాషా, నాగార్జునాచారీ, పెద్ది శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...