ప్రజా సంక్షేమమే..ప్రభుత్వ లక్ష్యం

Sun,July 14, 2019 01:24 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : రాష్ర్టాభివృద్ధి, ప్ర జా సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మర్లు, మెట్టుగడ్డలో రూ.25లక్షల తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేం ద్రంలోని ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన ఐ దేళ్ల కాలంలోనే రూ.330 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పట్టణంలోని అంతర్గత రోడ్లను విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పా టు చేశామన్నా రు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ శుద్ధజలం అందిస్తున్నామని తెలిపారు. అక్కడక్కడ మిగిలిన పనులను పూర్తి చే సేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో 50 ఏళ్ల వరకు తాగునీటి ఇబ్బంది ఏర్పడకుండా మిష న్ భగీరథ పథకాన్ని రూపొందించడం జరిగిందన్నా రు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు.

రోడ్డు నిర్మాణం పరిశీలన
జిల్లా కేంద్రంలోని మల్లికార్జున్ చౌ రస్తా నుంచి స్టేషన్‌రోడ్డు చౌరస్తా వ రకు రూ.కోటీ 50లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. రోడ్డు విస్తరణలో భాగంగా డివైడర్, గ్రీనరి, సె్రంటల్ లైటింగ్ ఏర్పా టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పను ల్లో నాణ్యత లోపించకుండా చూ డాలన్నారు. ఇప్పటికే రాజేందర్‌నగర్‌లో రోడ్డు విస్తరణ పూర్తి చేశామని, పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కా వాలన్నారు. కార్యక్రమంలో క మిషనర్ సురేందర్, మున్సిపల్ మాఈజ వైస్ చైర్మన్ రాములు, మాజీ కౌన్సిలర్లు మహమూద్ అలీ, కృష్ణమోహన్, విఠల్‌రెడ్డి, అనిత, ఎంఈ సత్యనారాయణ, డీఈ మురళీమోహన్‌రెడ్డి, నాయకులు గోపాల్ యాదవ్, పిల్లి సురేశ్, అనిత, ల క్ష్మి, బుక్క మోహన్‌బాబు, మురళీ, గోపాల్, శ్రీనివాస్, రాములు, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

11
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles