మహిళలూ మహారాణులు

Sun,July 14, 2019 01:24 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ : నారాయణ పేట జిల్లాలో 56 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 50 శాతం మహిళలకు రిజర్వేషన్ సదుపాయం కల్పించడంతో జిల్లాలో 28 స్థానాలలో మహిళా ప్రజాప్రతినిధులకు చోటు దక్కనుం ది. వీటికి తోడు కొన్ని చోట్ల గెలుపు బాటలో ఉండే మహిళలను సైతం జనరల్ స్థానాలలో రాజకీయ పార్టీలు పోటీకి నిలబెట్టనున్నాయి. దీంతో నారాయణపేట జిల్లాలో మున్సిపల్ వార్డులలో మహిళా ప్రజాప్రతినిధుల సం ఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మహిళా రి జర్వేషన్‌కు ముందు వరకు వంటింటికే పరిమితమ య్యే మహిళలు రాజకీయ మహిళా రిజర్వేషన్ కారణంగా ఇప్పుడిప్పుడే ఇల్లు వదలి బయటకు వస్తున్నారు. ఇంటిని చక్కపెట్టడంలో పైచేయిగా నిలిచి అతివలు, రాజకీయాల్లో కూడా రాణించే పరిస్థితి లేకపోలేదు. జిల్లా పరిధిలోని ఒక్క కోస్గి మున్సిపాల్టీ మినహా నారాయణపేట, మక్తల్ మున్సిపాల్టీలో మహిళా ఓటర్లదే పైచేయి ఉంది. నారాయపేట మున్సిపాల్టీలో మొత్తం 31075 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 15660, పురుషులు 15415 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో పురుష ఓటర్ల కంటే 245 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

అదే విధంగా మక్తల్ మున్సిపాల్టీలో మొత్తం 19322 మం ది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 9741, పురుషులు 9581 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా పురుష ఓటర్ల కంటే 160 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కోస్గి మున్సిపాల్టీ మొత్తం 16,991 మంది ఓటర్లు ఉండగా ఇక్కడ మాత్రం మహిళా ఓటర్ల కంటే 345 మంది పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. గత రెండు వరుస ఎన్నికల్లో నారాయణపేట మున్సిపాల్టీలో మహిళలకే చైర్‌పర్సన్ సీటు రిజర్వు అయ్యింది. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళకు రిజర్వు కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన శశికళ చైర్‌పర్సన్‌గా 2009 వరకు కొనసాగారు. 2009 నుంచి 2014 వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన సాగింది. తిరిగి 2014లో జరిగిన ఎన్నికల్లో మరో మారు మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో గందె అనసూయ ఈ నెల 2వ తేదీ వరకు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. ఇక మక్తల్, కోస్గిల విషయానికి వస్తే ఇవి రెండు కూడా కొత్తగా ఏర్పడిన మున్సిపాల్టీలు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మొదటి సారి అని చెప్పవచ్చు.

12
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles