ప్రజల్లో భక్తిభావం పెరగాలి

Wed,July 17, 2019 05:51 AM

అడ్డాకుల: ప్రజల్లో భక్తిభావం పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని కందూరు శివారులోని జాతీయ రహదారి వద్ద ఉన్న షిర్డీసాయి ఆలయంలో మంగళవారం సతీసమేతంగా పూజలు నిర్వహించి హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో కళకళలాడాలని సాయిబాబాను ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షిర్డీ సాయిబాబా చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడవాలని కోరారు. సాయిబాబా ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అనాధ ఆశ్రమం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని ఆలయ ధర్మకర్త, పూజారులు, గ్రామ పెద్దలు మంత్రికి వివరించారు. అనాధ ఆశ్రమానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, సర్పంచ్‌లు శ్రీకాంత్, జయన్నగౌడ్, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, నాయకులు మహమూద్, దేవేందర్‌రెడ్డి, రమేష్‌గౌడ్, నరెందరాచారి, భీమన్న యాదవ్, రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆల ప్రత్యేక పూజలు
గురుపౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి షిర్డీ సాయిబాబా ఆలయంలో సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమ గుండానికి పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు అందజేశారు. ఆయన వెంట నాయకులు పాల్గొన్నారు.

17
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles