నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం ఉండొద్దు

Tue,August 13, 2019 02:48 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపేందుకు జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ కార్యాలయం నిర్మించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఆవరణలో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్ కార్యాలయం పనులను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా పలు విషయాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో పార్టీ కార్యాలయం ఉంటూ అందరి సమస్యలను పరిష్కరించేందుకు కార్యాలయం త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసకోవాలన్నారు. అనుకున్న సమయానికి పార్టీ కార్యాలయం పనులు పూర్తి కావాలని తెలిపారు.

సమయం వృథా చేయకుండా పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మేరకు పార్టీ కార్యాలయం రూపకల్పనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాంట్రాక్టరు ప్రత్యేకంగా దృష్టి సారిస్త్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని.. సమస్యలు లేకుండా పనులను మరింత వేగంగా పూర్తి చేసుకుని ప్రజలకు మరింత అండగా ఉందామని తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షలు సుదీప్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజేశ్వర్, మోహన్‌బాబు తదితరులు ఉన్నారు.

17
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles