పూర్తిగా తగ్గని వరద

Thu,August 15, 2019 03:11 AM

మాగనూర్/ కృష్ణ : కృష్ణానదిలో వరద ప్రవాహం పూర్తిగా తగ్గక పోవడంతో హిందూపూర్ గ్రామం ముంపు నుంచి బయట పడలేదు. దీంతో ఆదికారులు హిందూపూర్ వరద ముంపు భాదితులను కున్సీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కొనసాగిస్తున్నారు. మంగళవారం కృష్ణ నదీ ప్రవాహం కొద్దిగా తగ్గినట్లు కనబడగా గురువారం జూరాల ప్రాజెక్టు కొన్ని గేట్లు మూసి వేయడంతో బ్యాక్ వాటర్ పెరగడంతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి బుధవారం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ప్రవాహం కొద్దిగా పెరిగిందని అధికారలు చేబుతున్నారు. వరద ప్రవాహం కొద్దిగా తగ్గడంతో నది పరివాహక ప్రాంతంలో నీటిలో మునిగిన పంట పోలాలు బయట బడ్డాయి. కృష్ణ, హిందూపూర్ మధ్యలో వాగు ప్రవాహం తగ్గక పోవడంతో కృష్ణ, హిందూపూర్ గ్రామాలతో పాటు మక్తల్ వైపు రాకపోకలు కొనసాగడం లేదు. బుధవారం జురాల ప్రాజెక్టు డీఈ రవికుమార్ హిందూపూర్ గ్రామంతో పాటు వరద ప్రవాహ ప్రాంతలను పరీశీలించారు.

కొనసాగుతున్న సహయక చర్యలు
పక్షం రోజులు అతలాకుతలం చేససిన కృష్ణా, భీమా నదుల వరద బుధవారం నాటికి కొంత మేర తగింది. మండలంలోని వాసునగర్, మారుతీనగర్, హిందూపూర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకు పోయాయి. ఆయా గ్రామాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి వరద బాధితులకు సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

16
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles