మట్టి గణపతులను ప్రతిష్ఠిద్దాం : సీఐ

Thu,August 15, 2019 03:12 AM

కోస్గి టౌన్ : వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావ రణ పరిరక్షణకు కృషి చేద్దామని కోస్గి సీఐ ప్రేమ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఏకో ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు సీఐకి మట్టి వినాయక విగ్రహాన్ని బహూకరిం చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామా ల్లో యువకులు ఈ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పూను కోవాలని, దీని వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్లమవుతామని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తోపాటు రసాయన రంగులతో తయా రు చేసే విగ్రహాల వల్ల నీటిలో సైతం కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని వివరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
మరికల్ : పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామాల్లో వినాయక చవితికి మట్టి వినాయకులు ఏర్పాటు చేయాలని ధన్వాడ ఎస్సై శ్రీనివాసులు ప్రజలకు సూ చించా రు. బుధవారం ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వల్ల అనార్థాలు ఏర్పడుతాయని, చిన్నదైనా మట్టి వినాయకుల వల్ల ప్రజలకు గాని, జీవరాసులకు గాని ఎ లాంటి ఇబ్బందులు ఉండదని, అందుకే గ్రామాల్లో యువకులు మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని ఎస్సై సూచించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో మట్టి విగ్రహాన్ని ప్రదర్శించారు.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles