ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Fri,August 16, 2019 03:42 AM

కోస్గిటౌన్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునివ్వాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు.నాటిన మొక్క పెరిగి పెద్దదయ్యేంతవరకు ప్రతి ఒక్కరూ చొరువ తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. మొక్కలు నాటి సంరక్షించి పెద్ద చేస్తే ఆ ఫలాలు భావితరాలకు అందుతాయని, లేకుంటే రాబోయే రోజుల్లో ప్రాణవాయువు దొరకని దుస్థితి ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుకర్‌రావ్, జెట్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, రైతుసమన్వయసమితి అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, శాసం రామకృష్ణ, కూర వెంకటయ్య, రాస్నం బాల్‌రాజ్, రాజేశ్, వేణుగోపాల్, ఓంప్రకాష్, బిచ్చప్ప, వెంకట్ నర్సింహులు ఉన్నారు.

16
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles