కోస్గి మున్సిపాలిటీ ఎన్నికలపై హైకోర్టు స్టే

Sat,August 17, 2019 02:19 AM

కోస్గి టౌన్ : కోస్గి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు మధ్యంతర స్టే విధిచింది. శుక్రవారం కోర్టు ఆదేశాల ప్రతులు నారాయణపేట జిల్లా కలెక్టర్, కోస్గి మున్సిపల్ కమిషనర్‌కు ఉత్తర్వులు అందాయి. కాగా నూతనంగా ఏర్పడిన కోస్గి మున్సిపాలిటీలో ఓటరు జాబితా, వార్డుల విభజన తదితర అంశాలు సరిగా లేవని పలువురు మున్సిపాలిటీ ఓటర్లు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఎన్నికలపై స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న కోస్గి నూతనంగా పక్కనున్న ఆరు రెవెన్యూ గ్రామాలు కలుపుకొని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. కాగా ఈ మున్సిపాలిటీలో 16 వార్డులుగా విభజించి ఒక్కో వార్డులో సుమారు వెయ్యికి పైగా ఓటర్లును ఉంచుతూ వార్డుల విభజన జరిగింది. అయితే ఈ విభజనలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించలేదని ఇష్టానుసారంగా చేశారని పలువురు కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు స్టే విధించింది.

16
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles