భూమిలోనే ఉత్పిత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం

Sat,August 17, 2019 02:20 AM

మూసాపేట : ఉన్న భూమిలోనే ఉత్పిత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేప ట్టిందని జిల్లా వ్యవసాయాధికారి వై సుచరిత అన్నారు. జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద మండలంలోని తున్కినీపూర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా గ్రామంలోని రైతులకు తెలంగాణ భూసార పరీక్ష విశేషణ పత్రముల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ అధ్య క్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెతో పాటు, వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ హుక్య నాయక్, ఏడీఏ యశ్వంత్‌రావు, జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్, ఎంపీపీ గూపని కళావతి కొండయ్య హాజరై మాట్లాడారు. సంవత్స రాలు గడుస్తున్న కొద్ది జనాభా సంఖ్య పెరుగు తోంది. కానీ భూమి మాత్రం అంతే ఉంది. ఉన్న భూమిలో పరిశ్రమలు, వెంచర్ల ఏర్పాటుతో పంటపండించే పొలం మరింత తగ్గిపోతుందని చెప్పారు.

కావున మనుషులకు సరిపడేవిధంగా ఉన్న భూమిలోనే ఉత్పిత్తిని పెంచాలని, అందుకు రైతులకు వ్యవసాయ నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటిం చాలని చెప్పారు. మీకు ఎల్లప్పుడు వ్యవసా యాధికారులు అందుబాటులో ఉంటారని, మీరు పంట వేసే సమయం నుంచి మొదలు కొని దిగుబడి చేతికి వచ్చే వరకు అధికారులను సంప్రదించాలని చెప్పారు. అప్పుడు అను కున్న విధంగా దిగుబడి పెరుగుతుందని చెప్పారు. అందులో తున్కినీపూర్ గ్రామాన్ని పైలేట్ ప్రాజెక్టుకింద ఎంపిక చేశామన్నారు. కావున గ్రామంలో ప్రతి రైతు భూమిని పరీ క్షలు చేసి అందులో ఏం పంటలు వేయొచ్చని, ఆ పంటలకు ఏలాంటి తెగుళ్లు వస్తాయి. వా టికి ఏలాంటి ఎరువులు, వాడాలనే విష యాలతో తీసుకోవాల్సిన జాగ్రతలను రైతు లకు తెలియజెప్పారు. అనంతరం రైతులకు భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామంలోని ఆముదం పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ పంటకు వచ్చిన తెగుళ్లను గుర్తించి వాడాల్సిన ఎరువులను తెలియజెప్పారు. ఈ కార్య క్రమంలో ఏవో రాజేందర్‌రెడ్డి, ఏఈవో శివ, స్వేతా, నాయకులు గూపని కొండయ్య, బాలన్న, డి బాల్‌రాజ్, రమేష్‌లతో పాటు గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

17
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles