నీలి విప్లవం దిశగా అడుగులు

Sat,August 17, 2019 02:24 AM

-మత్స్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి
-మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, పర్ధీపూర్ రిజర్వాయర్‌లలో చేప పిల్లల విడుదల

దేవరకద్ర, నమస్తే తెలంగాణ/చిన్నచింతకుం ట : తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మె ల్యే రాజేందర్‌రెడ్డిలతో కలిసి లక్షా 25వేల చేప పిల్లలను వి డుదల చేశారు. అలాగే, చిన్నచింతకుంట మండలంలోని పర్ధీపూ ర్ రిజర్వాయర్‌లో జెడ్పీ చైర్‌పర్సన్, ఎ మ్మెల్యే ఆలతో కలిసి లక్షా 20వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మత్స్యకారుల అబివృద్ధికి ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందన్నారు.

మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడంతోపా టు, మత్స్యకారుల జీవనోపాధి కోసం చెరువుల్లో వం దశాతం సబ్సిడీపై చేప పిల్లలను విడుదల చేస్తుందన్నా రు. చేపల విక్రయం కోసం మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలను అందిస్తుందన్నారు. అర్హులందరూ ప్ర భుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ దే శంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అ న్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమం త్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. అలాగే, చిన్నచింతకుంట, చిన్న వడ్డెమాన్ గ్రామాల సమీపంలోని వాగు గట్టుపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు మొక్కలు నాటారు.

కార్యక్రమంలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, మత్స్య సహకార సం ఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, చిన్నచింతకుంట జెడ్పీటీసీ వట్టెం రాజేశ్వరి, ఎంపీపీ హర్షవర్దన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మన్యంగౌడ్, నాయకులు వట్టెం రాము, ప్రతాప్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, దేవరకద్ర ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్, జెడ్పీటీసీ అన్నపూర్ణ, మా ర్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, టీఆర్‌ఎస్ మం డల అధ్యక్షుడు శ్రీ కాంత్ యాదవ్, నాయకులు జెట్టి నర్సింహారెడ్డి, కొండా శ్రీనివాస్‌రెడ్డి, కుర్వ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

16
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles