ఆర్డీఎస్ ఆనకట్టకు నిలకడగా వరద

Sun,August 18, 2019 01:49 AM

అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి విడుదలవుతున్న వరద నీరు ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నిలకడగా కొనసాగుతోంది. టీబీ డ్యాం నుంచి విడుదలైన వరద అదే స్థాయిలో ఆనకట్టపై ప్రవహిస్తోంది. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి 79,827 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 61,190 క్యూసెక్కులు వస్తుండగా, ఆనకట్టపై 3.5 అడుగుల మేర ప్రవాహం కొనసాగుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఈఈ రామయ్య తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకీ వరద చేరుతోందని ఆయన పేర్కొన్నారు.

ఆర్డీఎస్ ఆయకట్టుకు 460 క్యూసెక్కులు విడుదల
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 460 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు వస్తున్న వరదను పొలాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles