జూరాలకు తగ్గుతున్న వరద

Sun,August 18, 2019 01:50 AM

అయిజ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి, నారాయణపుర, జూరాల ప్రాజెక్టులకు సైతం వరద తగ్గుముఖం పడుతోంది. ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతుండగా ప్రియదర్శిని జూరాలకు శనివారం ఇన్‌ఫ్లో 5,48,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 5,39,971 గా నమోదైంది. దీంతో జూరాల 41 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా దిగువకు 5,29,957 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 9.657 టీఎంసీలకు గాను 7.682 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.

జూరాల కుడి కాల్వకు 738, ఎడమ కాల్వకు 1,190, సమాంతర కాల్వ ద్వారా 850 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం రెండు పంపుల ద్వారా 1500, బీమా లిప్టు - 1 ద్వారా 1300, బీమా లిప్టు -2 ద్వారా 1500, కోయిల్‌సాగర్ లిప్టు ద్వారా 630 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4,56,407 ఉండగా, అవుట్‌ఫ్లో 4,56,407 క్యూసెక్కులుగా నమోదైంది. 129.72 టీఎంసీలకు గాను 105.74 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపుర ప్రాజెక్టుకు 4,85,449 ఇన్‌ఫ్లో ఉండగా, 4,72,380 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదు కాగా ప్రస్తుతం 26.54 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. వరద వచ్చిన నాటి నుంచి శనివారం వరకు జూరాల ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 672.626 టీఎంసీల వరద నీటిని విడుదల చేసినట్లు డ్యాం ఈఈ శ్రీధర్ తెలిపారు.

12
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles