రాష్ట్రంలో పారదర్శక పాలన

Sun,August 18, 2019 01:51 AM

నర్వ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ప్రజలు అడగకుండానే అనేక పథకాలు రూపొందించి ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటా రు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అడుగకుండానే అన్ని రకాల పథకాలను రూపొందించి అన్ని పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. అన్ని ఎన్నికలు ముగిసినందున విలువైన ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అన్ని గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని అన్నా రు. కాబట్టి గ్రామాలలో స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన వారైవున్నా అందరు సమన్వయంతో అధికారులను కలుపుకొనిపోతూ గ్రామాలను అభివృద్ధ్ది పరుచుకోవాలన్నారు.

స్వచ్ఛభారత్ పథకంలోని మరుగుదొడ్ల నిర్మాణంలో రాంపూర్ నర్వ మండలంలో వందశాతం ఓడీఎఫ్ సాధించిన మొదటి గ్రామమని అందుకే ఈ గ్రామాభివృద్ధికి తాను ప్రత్యేక శ్రద్ధ వహిస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను కోరగా త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతుభీమా పథకం ద్వారా లబ్ధి పొందిన నర్వ మణెమ్మ తన కుటుంబానికి ఆసరాగా నిలిచిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీపీవో మురళి, ఎంపీడీవో రమేశ్‌కుమార్, జెడ్పీటీసీ గౌని జ్యోతికి, ఎంపీపీ జయరాములు, స్థాని క ఎంపీటీసీ పద్మమ్మ, సర్పంచ్ సుచరితారెడ్డి, ఉపసర్పంచ్ నాగరాజు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వీ మహేశ్వర్‌రెడ్డి, నాయకులు లక్ష్మణ్‌గౌడ్, డాక్టర్ శంకర్‌లతోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్‌ఎస్ నాయకులు, గ్రా మస్తులు పాల్గొన్నారు.

15
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles