అభివృద్ధికి అందరి సహకారం కావాలి

Mon,August 19, 2019 02:57 AM

-ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తా..
-జెడ్పీ చైర్ పర్సన్ వనజ, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
-మండల పరిషత్ కార్యాలయం ప్రారంభం
కృష్ణ : నూతన మండలంలో అభివృద్ధికి అందరి సహకారం ఉండాలని జెడ్పీ చైర్ పర్సన్ వనజ, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నూతన మండల పరిషత్ ప్రారంభోత్సవానికి వారు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మండలంలో మం డల పరిషత్ కార్యాలయ నూతన భవనం ఏర్పాటు సంతోషంగా ఉందన్నారు. ఇంకా కొన్ని ప్రభు త్వ కార్యాలయాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని, అందు కు ప్రజల సహకారం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అంజనమ్మ పాటిల్, ఎంపీపీ పూర్ణిమ, ఎంపీడీవో పాండు, కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ ఖదీర్, పార్టీ మండల అధ్యక్షుడు విజయప్పగౌడ్, మహిపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరప్పగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ఆంజనేయులు, టీఆర్‌ఎస్ నాయకులు శివపాటిల్, మోనేష్, శంకరప్ప, వెంకటేశ్, మహేశ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఎంపీటీపీలు పాల్గొన్నారు.

12
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles