మనగ్రామాభివృద్ధి.. మన బాధ్యత

Tue,September 17, 2019 02:57 AM

-30రోజులు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయండి
-కలెక్టర్ రొనాల్డ్‌రోస్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: మన ఇల్లును ఎలాగైతే పరిశుభ్రంగా ఉండాలనే కోరుకుంటామో మన వార్డు.. మన గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండేవిధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరం కోరుకుంటేనే పరిశుభ్రత సాధ్యమవుతుందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. సోమవారం ధర్మాపూర్‌లో నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా అందరూ సమిష్టిగా గ్రామాభివృద్ధి కోసం అడుగులు వేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి అందరికీ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్త్తూ ముందుకుసాగాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ పకడ్బందీగా ముందుకు తీసుకుపోవాలని సూచించారు. సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగితేనే అభివృధ్ధి మనవంశం అవుతుందని తెలియజేశారు. జెడ్పీచైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఉన్నారు.

మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టాలి
వృక్ష సంపదతోనే మానవ మానుడగ ఆదరపడి ఉందని జిల్లా కలెక్టర్ రొనాల్డరోస్ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం దగ్గర కలెక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సదర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటడమే కాకుండ వాటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే మండల కేంద్రంలోని ఉన్ని కార్మికులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌కు సోమవారం ఉన్ని కార్మికులు వినతిపత్రం అందజేశారు.

పంచాయతీలు పురోగతి సాధించాలి
దేవరకద్ర రూరల్: గ్రామ పంచాయతీల పురోగతి ప్రణాళికబద్ధంగా ముందుకుసాగాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పిలుపునిచ్చారు. 30 రోజుల అభివృద్ధి ప్రణాళికపై సోమవారం ఎంపీపీ రమాదేవి అధ్యక్షతన సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో చేపడుతున్న పనులు, అభివృద్ధి ప్రణాళికపై చర్చించారు. డీపీవో వెంకటేశ్వర్లు, సీఈవో యాదయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వెంకటరమణ, జెడ్పీటీసీ అన్నపూర్ణ, ఎంపీపీ రమాదేవి, ఏఎంసీ చైర్మన్ దొబ్బిలి ఆంజనేయులు, ఎంపీడీవో గోపాల్‌నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం
చిన్నచింతకుంట: అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు సహకారించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, ప్రత్యేకాధికారులు, గ్రామకార్యదర్శులు, ఉపాధి సిబ్బందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30రోజుల ప్రణాళికపై ప్రతి ఒక్కరూ ఒకరోజు ఒకగంటపాటు పనిచేయాలన్నారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, సీఈవో యాదయ్య, జెడ్పీటీసీ రాజేశ్వరి, స్పెషల్ అధికారి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles