సృజనాత్మకతను వెతికితీయుటకు ఇగ్నైట్

Wed,September 18, 2019 01:43 AM

అమ్రాబాద్ రూరల్: విద్యార్థిని విద్యార్థులకు వారిలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయుటలో భాగంగానే (ఇగ్నైట్) కార్యక్రమంను మండల పరిధిలోని మన్ననూర్ పీటీజీ పాఠశాల/కళశాలలో మంగళవారం పాఠశాల ప్రిన్సిపాల్ మోగిలయ్య ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన గురుకులాల రివిజినల్ సమన్వయకర్త కళ్యాణీ మరియు ప్రిన్సిపాల్ విలేఖరులతో మాట్లాడుతూ గురుకులాల సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని (పీటీజీ) గురుకుల పాఠశాల/కళశాల విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడ జరుగుతందని ఆయన తెలిపారు. మొదటి రోజు డిబేట్, సూఫర్ స్టుడెంట్స్, ఎలక్యూషన్ మరియు క్విజ్ అండర్ 14 మరియు అండర్-17 విభాగాల్లో జూనియర్, సీనియర్ విద్యార్థిని విద్యార్థులకు పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో 320 మండది విద్యార్థులు పాల్గోంటారన్నారు. అలాగే రెండో రోజు అనగా బుదవారం కూడ 320 మంది విద్యార్థులు హాజరౌతారని, వీరికి స్పెల్ బీ, యూత్ పార్లమెంట్, ఇతాతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. గురుకులాల్లో ఇలాంటీ కో కరికులం కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రావీణ్యతను పొందుతూ మంచి క్రమశిక్షణను అలవర్చుకుంటారని గుర్తు చేశారు. నేటీ పోటీ ప్రపంచడంలో కార్పోరేటు విద్యసంవత్సలను మైమరిపించేల రాష్ట్రంలో ప్రభుత్వం అందించే చేయుతతో కేజీ నుండి పీజీ విద్యా గురుకులాల్లో కొనసాగుతుందన్నారు. గురుకుల విద్యా ప్రమాణాలు గతంలో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మేరుగైన పలితాలు సాదిస్తున్నాయని తెలిపారు. ప్రతి విద్యార్థి (అయాం నాట్ ఇంఫియర్ ఎవిరి వన్) నేను ఎవరికి తక్కువ కాను అనే విధంగా విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాలల్లో తీర్చి దిద్దుటకు గురుకులాల సెక్రటరీ చేస్తున్న కృషి చాల గొప్పదన్నారు. విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేయకుండ సృజనాత్మకతను పెంపొందించుటకు మా వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. బుధవారం సాయంత్రం ముగింపు కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరౌతారని గుర్తు చేశారు. పోటిల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తామన్నారు. ఇగ్నైట్ కార్యమాలకు నాయ్య నిర్ణేతలుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ పీటీజీ గురుకులాలకు చెందిన పెద్దమందడి ప్రిన్సిపాల్ మహేశ్వరి, కల్వరకుర్తి ప్రిన్సిపాల్ విజయరాంరెడ్డి, సరస్వతి, బాలనగర్ ప్రిన్సిపాల్ రాజారాం, యాదగిరి, వనపర్తి ప్రన్సిపాల్ గోవర్ధన్, కొండపూర్ ప్రిన్సిపాల్ జానునాయక్, జడ్‌చర్ల ప్రిన్సిపాల్ సరస్వతి కేటాయించామన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles