భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించండి

Thu,September 19, 2019 01:39 AM

-గ్రీన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు
నారాయణపేట, నమస్తేతెలంగాణ : కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి గ్రీన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ వెంకట్రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట, దామరగిద్ద, మరికల్ మూడు మండలాల్లో ఆర్డీవో, డీఎఫ్‌వో, ఏడీ సర్వే ల్యాండ్ అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టి నివేదికలను సమర్పిం చాలని ఆదేశించారు. నర్సరీలను ఆయా గ్రామ పంచాయతీలకు స్వాధీన పరచాల్సిందిగా డీఆర్‌డీవోకు ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ నర్సరీలలో ఉన్న మొక్కలను గ్రామాలలో నాటించాలని, ఒక మీటర్ పొడవున్న మొక్కలను నాటేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ ప్లాన్ ప్రకారం మొక్కలు పంపిణీ చేయాలని, ఎనిమిది కాలమ్స్ ప్రొఫార్మాను వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. 49 నర్సరీలలో ఉన్న మొక్కల వివరాలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో సీఈవో కాళిందిని, ఆర్డీవో శ్రీనివాసులు, అటవీశాఖ అధికారి గంగిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, ల్యాండ్ సర్వే ఎడీ శ్రీరాము లుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles