ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవం

Thu,September 19, 2019 01:40 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ : ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రానికి చెందిన మ్యాదరి (మహేంద్ర) సంఘం సభ్యులు బుధవారం వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా దవాఖాన సమీపంలో వెదురుతో కళాకారులు తయారు చేసిన బ్యాట్, గంప, పూల బుట్లు, వివాహా శుభకార్యాలకు సంప్రదాయబద్ధంగా తయారు చేసిన వెదురు వస్తువులను ప్రదర్శనగా ఉంచారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో శ్రీనివాసులు హాజరై కళాకారులు తయారు చేసిన వివిధ వెదురు వస్తువులను పరిశీలించి ఆయన అభినందించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవడానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో మ్యాదరి సంఘం గౌరవ అధ్యక్షులు వెంకట్రాములు, అధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి సూర్యకాంత్, మాజీ కౌన్సిలర్ భారతమ్మ, సభ్యులు అనంతయ్య, కోన వెంకటేశ్, పోలేపల్లి మధుసూదన్, నవీన్, రాజేశ్ పాల్గొన్నారు.

ఆత్మకూరు మండలంలో..
ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ఆత్మకూరు మ్యాదరి కులస్తుల ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక నీలకంఠేశ్వరస్వామి దేవాలయంలో మండల మ్యాదరి కులస్తులందరూ సమావేశమై తమ కుల దైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించారు. మహిళలు తమ తమ కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలను పంచుకు న్నారు. ఈ సందర్భంగా సహఫంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. చిన్న పిల్లలు నృత్యాలు చేస్తూ సరదాగా గడిపారు. మహిళలు కోళాటం, బొడ్డెమ్మలు వేశారు. పురుషులు భజన సంకీర్తనలు ఆలపిస్తూ ఆనందంగా గడిపారు. మ్యాదరి కులస్తులను ప్రభుత్వాలు గుర్తించాలని మండల మ్యాదరి కుల సంఘం అధ్యక్షుడు కొండయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో తోట రవి, కృష్ణయ్య, రాజశేఖర్, బుడ్డన్న, నరేశ్, మహేశ్, బండలయ్య, బుడ్డన్న, శ్రీనివాసులు, నరసింహ, నాగరాజు, వసంత, పుష్పావతి, సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles