ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదాం

Thu,September 19, 2019 01:40 AM

-జెడ్పీ చైర్‌పర్సన్ వనజ
కృష్ణ : అందరి సమిష్ఠి కృషితో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదామని జెడ్పీ చైర్‌పర్సన్ వనజ అన్నారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని కున్సి, ఐనాపూర్ ప్రత్యేక గ్రామసభకు ఆమె ముఖ్య అతిథులుగా హాజరై గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గ్రామంలో పుట్టి పెరిగినందుకు తమవంతుగా గ్రా మానికి ఏదైనా చేయాలన్నారు. అందుకు యువత సహకరించాలని, ఒక్కొక్కరు పది మొక్కలు నా టాలని సూచించారు. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు మాత్రమే పని చేస్తే మనం అనుకున్న ఫిలితాలు రావని, గ్రామస్తులంతా కలిసికట్టుగా మందడుగు వేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహగౌడ్, జెడ్పీటీసీ అంజనమ్మ పాటిల్, ఎంపీపీ పూర్ణిమా, పార్టీ మండల అధ్యక్షుడు విజయప్ప గౌడ, కార్యదర్శి మోనేశ్, యువ నాయకులు శివరాజ్ పాటిల్, సర్పంచులు, శంకరమ్మ, సావిత్రమ్మ, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles