హత్యకేసులో జీవితఖైదు -జరిమానా

Thu,September 19, 2019 01:40 AM

మహబూబ్‌నగర్‌లీగల్: హత్యకేసులో జీవితఖైదు, జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుబ్రమణ్యం బుధవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలగంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన షేక్‌సాదీక్, అతడి భార్య బతుకుదెరువు కోసం మ హబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం షేక్‌పల్లి గ్రామానికి వచ్చారు. ప్రకాశం జిల్లా పెద్దరావీడ్ మ ండలం రామయ్యపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన షేక్‌సాదీఖ్ భార్యతో వివాహేతర సం బంధం కొనసాగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో సాదీఖ్ పలు మార్లు గంగిరెడ్డిని హెచ్చరించారు. అయినా అతను అదేవిధంగా తన పద్ధతిని మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో 6. 1.2018 న రాత్రి సమయంలో షేక్‌సాదీక్ ఇంటి కి వెళ్లి గంగిరెడ్డి తలుపుకొట్టాడు. దీంతో మళ్లీ తన ఇంటి కి భార్య కోసమే వచ్చాడని గంగిరెడ్డిపై సాదీక్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీఆర్‌ఓ సుంకరి మ హేశ్వర్ ఫిర్యాదు మేరకు అప్పటి హన్వాడ మం డలం ఏఎస్సై వెంకటస్వామి కేసు నమోదు చేశా రు. అప్పటి సీఐ పార్థసారధి విచారణ చేపట్టారు. నిందితుడిపై 2/2018 నెంబర్‌తో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 23.7.2018న చార్జిషీట్‌పైన్ సీఐ కిషన్ కోర్టులో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కో ర్టు కేసును విచారణ చేపట్టింది. ఈ విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున పీపీ బాలగంగాధర్‌రెడ్డి 13 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు షేక్‌సాదీక్‌కు జీవితఖైదు, 5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారని పీపీ తెలిపారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles