వ్యక్తి ఆత్మహత్య

Thu,September 19, 2019 01:40 AM

మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా కేం ద్రంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి ఆత్మ హ త్యకు పాల్పడి మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుందని మహబూబ్‌నగర్ రైల్వే ఎస్సై రాఘవేందర్ గౌ డ్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని న్యూగంజ్ ప్రాంతానికి చెంది న యాదయ్య(45) అనే వ్యక్తి తన భా ర్య, పిల్లలతో కలసి రోజు కూలీపని చేస్తు జీవిస్తూ ఉంటున్నాడు. ఈ క్రమంలో గతకొన్ని నెలల నుంచి అనారోగ్యనికి గురైన యాదయ్య మనస్తాపంతో బాధపడుతుండేవాడు. అయితే బుధవారం ఉదయం ఇంట్లో నుంచి వచ్చిన యాదయ్య కాటన్‌మిల్లు సమీపంలో ఉన్న రైలు పట్టాల వద్ద వ స్తున్న రైలుఢీకొని ఆత్మహత్యకు పాల్పడాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికు లు రైల్వే పో లీస్‌స్టేషన్‌కు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చెరుకొని మృతదేహన్ని పరిశీలించి వివరాలు సేకరించి, పోస్టుమా ర్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్ర భు త్వ జనరల్ దవాఖాన మార్చురికి తరలించారు. విషయం వారి కుటుంబ స భ్యులు తెలిపారు. ఈ మేరకు వారి కుటుంబ స భ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles