పీయూకు మహర్దశ

Thu,September 19, 2019 01:42 AM

-యూనివర్సిటీ అభివృద్ధికి రూ.20 కోట్లు
-న్యాక్ గ్రేడింగ్ ద్వారా రూసా ఫండ్స్ విడుదల
-నూతన బాలికల వసతి గృహ నిర్మాణానికి ప్రాధాన్యం
-వివిధ అభివృద్ధి పనులు చేపడుతాం : రిజిస్ట్రార్
- హర్షం వ్యక్తం చేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు

పాలమూరు యూనివర్సిటీ: పాలమూరు విశ్వవిద్యాలయం అభివృద్ధికి న్యాక్ గ్రేడింగ్‌తో రూ. 20కోట్లు మంజూరైనట్లు పీయూ రిజిస్ట్రార్ పిండి పవన్‌కుమార్ తెలిపారు. మొదటిసారిగా పీయూకు న్యాక్ గ్రేడింగ్ రావడంతో పెండింగ్‌లో ఉన్న యూనివర్సిటీ అభివృద్ధి పనులకు ఉపయోగించడం జరుగుతుందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఎగ్జామినేషన్ గ్రాంట్స్, వాటర్ ట్యాంకు, హెల్త్‌సెంటర్‌ను డెవలప్ చేస్తామన్నారు. అదేవిధంగా క్యాంపస్‌లో నూతనంగా బాలికల వసతి గృహాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని, స్పోర్ట్స్ అభివృద్ధికి కూడా రూసా ఫండ్స్‌ను వాడుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లాను చదువుల జిల్లాగా తీర్చిదిద్దడానికి విద్యతోపాటు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పవన్‌కుమార్ అన్నారు. పీయూకు న్యాక్ బీ గ్రేడ్ రావడంతో రూసా ఫండ్స్ మంజూరు కావడం హర్షణీయమని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles