డెంగీ వ్యాధిపై అవగాహన కల్పించాలి

Fri,September 20, 2019 02:10 AM

కోస్గి : గుండుమాల్ ప్రభుత్వ దవాఖానలో జిల్లా వైద్యాధికారిణి సౌభాగ్యలక్ష్మీ గురువారం సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వైద్య సిబ్బందితో మండలంలోని అన్నిగ్రామాలకు చెందిన వివరాలను సేకరించారు. ప్రతి గ్రామంలో ప్రసవాలు ప్ర భుత్వ దవాఖానలోనే జరగాలని ఆదేశించారు. ముఖ్యంగా డెంగీ వ్యాధిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ వ్యాధినివారణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా టీబీ, కుష్ఠువ్యాధి గ్రస్తులను ముందుగానే గు ర్తించివారికి అవసరమైన మేరకు వై ద్య ం అందించాలని అన్నారు. వారికి వైద్యపరీక్షలు నిర్వహించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల్లో నిత్యం అందుబాటులో ఉంటు విషజ్వరాలపై అవగాహన కల్పించి తగిన వైద్యసహాయాన్ని అందించాల్సి ఉంటుందన్నారు. సక్రమంగా విధులు నిర్వహించని సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. జిల్లా టీ బీ అధికారి రాఘవేందర్, గుండుమాల్ ప్రభుత్వ వైద్యుడు రాఘవేంద్రకుమా ర్, అధికారులు హన్మంతు, వైద్య సిబ్బంది శోభారాణి, సూపర్ వైజర్లు రాంచంద్రాజీ, నిర్మల, రవికుమార్, శ్రీనివాస్, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles