నూతనభవనాన్ని త్వరలో నిర్మిస్తాం

Fri,September 20, 2019 02:10 AM

కోస్గిటౌన్: పట్టణంలోని నెహ్రూపార్కులోగల గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ఉందని, ప్రస్తుతం గ్రంథాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి గారి అనుమతితో ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహానికి మారుస్తామని జిల్లా గ్రంథాలయ శాఖచైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ కోస్గి గ్రంథాలయం శిథిలావస్థకు చేరిందని దీంతో పాఠకులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. పాఠకులకు ఇబ్బంది కలగకుండా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గ్రంథాలయాన్ని ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి మారుస్తామన్నారు. నూతన భవననిర్మాణానికి రూ. 8 లక్షలు మంజూరైందని వెంటనే నూతన భవనం నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో మనోజ్‌కుమార్ లైబ్రేరియన్ నర్సింహులు, స్థానిక నాయకులు వేణుగోపాల్, వెంకట్‌నర్సింహులు తదితరులున్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles