ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది

Fri,September 20, 2019 02:11 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి అన్నారు. జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో గురువారం క్రౌన్ ఫంక్షన్ హాలులో ప్రైవేటులో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు, 2018-19లో 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు, సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ, పురస్కారాలతోపాటు ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులను, విద్యార్థులను సన్మానించి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జలజం సత్యనారాయణ, జిల్లా వైద్య సలహాదారులు డాక్టర్ మధుసూధన్‌రెడ్డి, న్యాయ సలహాదారులు బెక్కెం జనార్దన్, గౌరవ సభ్యులు కోదండపాణి, జిల్లా అధ్యక్షుడు ఎన్.ప్రభాకర్, కార్యనిర్వహణ అధ్యక్షుడు రాంచందర్‌జీ, పట్టణ అధ్యక్షురాలు మాధవి, జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్‌గౌడ్, సురేందర్, అక్తర్‌బేగం, సుల్తాన్‌పాషా పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles