ప్రశాంత వాతావరణం కోసమే..

Sat,September 21, 2019 12:16 AM

మరికల్ : మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 61 మంది పోలీసులు ఎస్పీ, డీ ఎస్పీలు, ముగ్గురు సీఐలు, 11 మంది ఏస్సైలతో కార్డన్ సెర్చ్ కొనసాగించారు. మండల కేంద్రంలోని గజ్జలమ్మగడ్డ, మాధవరం రోడ్డు ప్రాంతాన్ని పోలీసులు జల్లడ పట్టా రు. ప్రతి ఇంటికీ తిరిగి వివరాలను సేకరించారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వారు అనుమానాస్పందగా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూ చించారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ చేతన గ్రామంలో విస్తృతం గా పర్యటించారు. పలు చోట్ల విద్యార్థులు, మహిళలతో ఎస్పీ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ, షీ టీం గురించి వివరించారు. అలాగే బాలికల ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఎస్పీ షీటీమ్స్‌పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ మీకు ఏదైనా సమస్య ఉంటే మీ నేస్తం ఫిర్యాదు బాక్సు ఓ ఫిర్యా దు రాసి వేస్తే చాలు మీ సమ స్య పరిష్కారమవుతుందన్నారు. ము ఖ్యంగా మీరు పాఠశాలలు వచ్చిపోయే సమయాల్లో ఎవరైనా పోకిరీలు వేధిస్తే కూడా పోలీసులకు స మాచారం ఇవ్వవచ్చని చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తున్న క్రమంలో ఎస్పీ చిన్నారులకు చాక్లె ట్లు పంపిణీ చేశారు. అంతకు ముం దు కార్డన్ సెర్చ్‌పై పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు పలు సూచనలు చేశా రు. కాగా శుక్రవారం నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో తొమ్మిది బైకులకు సంబంధించిన పత్రాలు లేక పోవడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట డీఎస్పీ శ్రీధర్, మరికల్, కోస్గి, నారాయణపేట సీఐలు ఇఫ్తేకర్ అహ్మద్, సంపత్, ప్రేమ్‌కుమార్‌తోపాటు పలువురు ఎస్సైలు, పోలీస్‌కానిస్టేబుళ్లు ఉన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles