రోటా వ్యాక్సిన్ తప్పక వేయించాలి : డీఎంహెచ్‌వో

Sat,September 21, 2019 12:16 AM

మాగనూర్ : చిన్నారులకు రోటా వ్యాక్సిన్‌ను తప్పక వేయించాలని డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం మం డల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఎంపీపీ శ్యా మలమ్మ, జెడ్పీటీసీ వెంకటయ్యలతో కలిసి రోటా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మా ట్లాడుతూ రోటా వైరస్ వల్ల నీళ్ల విరేచనాలు అవుతాయని, అందుకే తల్లిదండ్రులు ఏడా ది, రెండు, మూడున్నర నెలల వయస్సు ఉన్న వారికి 6,10,14 వారాలలో ఈ వ్యా క్సిన్‌ను మూడు విడతలుగా వేయించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా అందజేస్తున్నదని, వీటిని స ద్వినియోగం చేసుకొని ప్రతి చిన్నారికి వ్యా క్సిన్ తప్పక వేయించాలని సూచించారు. అనంతరం దవాఖానను తనిఖీ చేసి వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీ తిప్పయ్య, సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ సుధా ఆంజనేయులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles